ఈ లింగ రూపములో ఉండే మహా శివుని పూజించడానికి ఉపయోగించే ఈ స్తోత్రములో ఎనిమిది శ్లోకములు ఉం టాయి. అందుచేత ఈ స్తుతిని లింగాష్టకం అంటారు. మహా శువుణ్ణి మానవాకారాంలో ఉన్న ప్రతిమ రూపంలో గాని చిత్ర రూపంలో గాని పూజించరు. లింగ రూపంలో మాత్రమే కొలవాలి. (శివాష్టకం, శ్రీ రుద్రం నమకమ్, చమకం శివ తాండవ స్తోత్రమ్, పంచాక్షరీ మంత్రం. చంద్రశేఖరాష్టకం. విశ్వనాధ అష్టకమ్ వేరే పేజీలలో ఉన్నవి చూడగలరు)
లింగాష్టకం
దేవముని ప్రవరార్చితలింగం
కామదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
సర్వసుగంధి సులేపితలింగం
బుద్ధివివర్థన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం
తత్ప్రణమామి సదాశివలంగం
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
కనకమహామణీ భూశితలింగం
ఫణీపతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
(అన్నపూర్ణా దేవి అష్టకము, మహిషాసుర మర్దినీ స్తోత్రము, శ్యామలా దండకం)
కుంకుమచందన లేపిత లింగం
పంకజహార సుశోభితలింగం
సంచితపాప వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
దేవగణార్చిత సేవితలింగం
భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
అష్టదళో పరివేష్టితలింగం
సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
సురగురు సురవరపూజితం లింగం
సురవరపుష్ప సదార్చితలింగం
పరమపదపరమాత్మకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )