సుమతీ శతకము

Rate this page

సుమతీ శతకము

సుమతీ శతకము: అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజమును
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియక సుమతీ!

ఇచ్చునదె విద్య రణమునఁ
జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులన్
మెచ్చునదె నేర్పు వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ!

ఇమ్ముగఁ జదువని నోరును
అమ్మాయని పిలిచియన్న మడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

ఉదకము ద్రావిడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకు జనకుర సుమతీ!

సుమతీ శతకము

ఉత్తమగుణములు నీచున
కెత్తెఱుఁగున గలుగనేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కఱగిపోసిన
నిత్తడి బంగారుమగునె యిలలో సుమతీ!
ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
నపకారికినుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ

ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుగువాఁడు ధన్యుఁడు సుమతీ!

ఎప్పుద్డుఁ దప్పులు వెదకెడు 
నప్పురుషునిఁ కొల్వఁగూడదది యెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!

ఓడలు బండ్లును వచ్చును
ఓడలు నాబండ్లమీఁద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే 
వాడంబడుఁ గలిమిలేమి వసుధను సుమతీ!

కనకపు సింహాసనమున
శునకముఁ గూర్చుండఁబెట్టి శుభలగ్నమునఁ
దొనరఁగ బట్టముగట్టిన
వెనుకటిగుణమేల మాను వినరా సుమతీ!

కమలములు నీటఁ బాసినఁ
గమలాప్తుని రశ్మి సోఁకి కమలినభంగిన్
దమ దమ నెలవులు దప్పినఁ
దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

కరణముఁ గరణమునమ్మిన
మరణాంతకమౌను గాని మనలేఁడు సుమీ
కరణము తన సరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!

కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందినపిదపన్
వాదుసుమీ యప్పిచ్చుట 
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!

కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంఠ కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!

కూరిమిగల దినములలో
నేరములెన్నఁడును గలుఁగనేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!

కొక్కోకమెల్లఁ జదివినఁ
జక్కనివాఁడైన రాజచంద్రుండైనన్
మిక్కిలి రొక్కమ్బీయక
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ!

నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

కొఱగాని కొడుకు పుట్టినఁ
కొఱగామియె కాదు తండ్రి గుణముల జెఱచు
జెఱకుతుద వెన్నుఁ పుట్టిన
జెఱకునఁ దీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ!

బలవంతుడు నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలెచీమలచేత చిక్కి చావదె సుమతీ!

మాటకుఁ బ్రాణము సత్యము
కోటకుఁ బ్రాణము సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణము వ్రాలు సిద్ధము సుమతీ

మానఘనుఁడాత్మధృతిఁజెడి
హీనుడంగువాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలములోపల
నేనుగు మొయి దాఁచినట్టు లెఱుగుము సుమతీ!


​పతికడకుఁ దన్నుగూర్చిన
సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ!

పరసతి కూటమిఁగోరకు
పరధనముల కాసపడకు పరునెంచెకుమీ
సరిగాని గోష్టి సేయకు
సిరిచెడిఁ జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా
పుత్రుని గనుకొని పొగడగ 
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

ఈ పేజీలు  కూడా చదవండి

పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణము నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బాణము మగువ సిద్ధము సుమతీ!

బలవంతుడు నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలెచీమలచేత చిక్కి చావదె సుమతీ!

మాటకుఁ బ్రాణము సత్యము
కోటకుఁ బ్రాణము సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణము వ్రాలు సిద్ధము సుమతీ!

మానఘనుఁడాత్మధృతిఁజెడి
హీనుడంగువాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలములోపల
నేనుగు మొయి దాఁచినట్టు లెఱుగుము సుమతీ!

​నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడుపుల కెల్లన్
నారియె నరులకు రత్నము
చీరయె శృంగార మండ్రు సిద్ధము సుమతీ!

పతికడకుఁ దన్నుగూర్చిన
సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ!

పరసతి కూటమిఁగోరకు
పరధనముల కాసపడకు పరునెంచెకుమీ
సరిగాని గోష్టి సేయకు
సిరిచెడిఁ జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా
పుత్రుని గనుకొని పొగడగ 
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణము నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బాణము మగువ సిద్ధము సుమతీ!

ALSO READ MY ARTICLES ON