పోతన పద్యములు
పోతన పద్యములు:
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
కూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల గౌద్దాలికులైన నేమి? నిజదార సుతోదర పోషణార్ధమై
పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట; నే
పలికిన భవహరమగునట
పలికెద వేఱొండుగాథ పలుకగనేలా?
చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి జుడువడేని
దయయు సత్యంబు లోనుగా తలపడేని
కలుగ నేటికి తల్లుల కడుపుచేటు
నీ పాదకమల సేవయు
నీపాదార్చకుల తోడి నెయ్యము నితాం
తాపాత భూత దయయును
తాపస మందార! నాకు దయసేయగదే
ఇందుగలడందు లేడను
సందేహము వలదు! చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే గలడు ! దానవాగ్రణి వింటే!
కమలాక్షు నర్చించు కరములు కరములు;
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు;
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు;
మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు;
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
వ్యాప్తింబొందకవగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్ తృప్తింజెందనిమనుజుడు సప్తద్వీపములనైన జక్కంబడునే
దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి
ALSO READ MY ARTICLES ON
- Indian Constitution (Important Articles)
- Citizen’s Fundamental Rights
- Basic Structure Doctrine of the Constitution
- Article 20
- Right to Life and Liberty
- Magna Carta
- England Bill of Rights
- American Bill of Rights
- French Bill of Rights
మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకునిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకులలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకుబూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవిందచింతనామృత పానవిశేష మత్తచిత్త మేరీతి నితరంబు జేరనేర్చువినుతగుణశీల! మాటలు వేయునేల?
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడియందుడిందుపరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడనాదిమధ్యలయుడెవ్వడు సర్వముతానైనవా డెవ్వడు వానినాత్మభవు ఈశ్వరునినే శరణంబువేడెదన్