హిందూ సనాతన ధర్మము

Rate this page

హిందూ సనాతన ధర్మము

హిందూ సనాతన ధర్మము: హిందూ గ్రంధములు మన సంస్కృతి సాంప్రదాయములను సనాతన ధర్మము అని సూచించినవి. ఎక్కడా కూడా హిందూ పదము కనబడదు. అలాగే మన దేశమును ఇండియా అని కూడా మన గ్రంధములలో ఎక్కడా చెప్పలేదు. అయినా గాని మన దేశము ప్రపంచం దృష్టిలో ఇండియానే కదా! సనాతనము అనగా అనాదిగా వస్తున్న ఆచారము అని అర్ధము. ధర్మము అనగా మానవులు పాటించవలసిన నియమ నిబంధనలు అని అర్థముగా చెప్పవచ్చు. అప్పుడు సనాతన ధర్మము అనగా మన పూర్వీకులనుండి మనకు అందించబడిన మరియు మనము మానవునిగా పాటించవలసిన నియమ నిబంధనలు. అయితే ఇతర మతములలో వలె ఈ ధర్మములు అమలు చేయ్యడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఏది మనకు లేదు. ఆ అవసరము లేకుండా పండితుని నుండి పామరుల వరకు సనాతన ధర్మమును అందరూ పాటిస్తూనే ఉంటారు. అందు చేతనే ఎన్నో ఇతర మతాలు ఇండియాలో ప్రవేశించినా భారతదేశం ఇప్పటికీ హిందూ సనాతన ధర్మము నిలిచి ఉంది. సర్వ జనులు హిందూ ధర్మమును కాపాడుకుంటూనే ఉన్నారు. ధర్మొ రక్షతి రక్షితః అను మనుస్మృతి వాక్యమును అనుసరిస్తూ!

ప్రాచీన కాలములో గ్రీకులు భారత దేశాన్ని ఇండియా అని పిలిచారు. పార్శీకులు అనగా పెర్షియనులు హిందూ అన్నారు. ఇద్దరు కూడా ఇండియాకు పశ్చిమ దిక్కులో ఉండేవారు. వారు ఇండియాను తొలుత వారికి తూర్పు దిక్కులో గల సింధు నది ప్రాంతమును సింధ్ లేక హింద్ అని ఇండ్ అని పేర్కొన్నారు. మెసపుటోమియా వారు మేలుహ అని అన్నారు. (మేలుహా పద వ్యుత్పత్తి గురించి వేరే పేజీ చూడండి.) హింద్, సింధ్, ఇండ్ అన్నీ కూడా సింధు నదిని సింధు నది ప్రాంతములో విలసిల్లిన నాగరికతను సంస్కృతిని సూచిస్తాయి. ప్రస్తుతము నెలకొని ఉన్న భారత దేశ భౌగోళిక రూపు రేఖలను బట్టి ఇప్పుడు సింధు నది పుట్టిన స్థలము చైనా లో ఉంది. సింధు నది ప్రవాహం ఎక్కువగా పాకిస్తాను లో జరుగుతుంది. పాకిస్తానును గాని చైనాను గాని సింధ్ అనరు ఎందుకంటే ప్రాచీన సింధు నాగరికత ఇప్పుడు భారత దేశంలోనే పృఢమిల్లుతుంది కాబట్టి.

….( ఈ క్రింది పాఠము నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేదకాల సమాజము) ” అను పుస్తకములోనిది. అధ్యాయము  25,  సనాతన ధర్మము’)

సనాతన ధర్మము

సనాతనము అనగా పురాతనమునుంచి వస్తున్న నిత్యమైన ఆచారము అని ఒక అర్థము. అందుచేత సనాతన ధర్మము సజీవముగా నిలచియున్న ఆచారము అని అనవచ్చు. అలా అని సనాతన ధర్మము వేలాది సంవత్సరములుగా ఒకే రకమయిన నియమములను అందరి జనులమీద అమలు చెయ్యదు. ఆచారా పరమో ధర్మః అన్నారు. అంటే సమాజములోని వివిధ జనులు వారికి వారసత్వముగా వస్తున్న వారి సాంప్రదాయములు, కట్టుబాట్లు, ఆచారములను వారికి వారు పాటించుకొనవలెను. ఎవరిమీద మతపరమయిన ఆంక్షలు ఎప్పుడూ లేవు.

మన ప్రాచీన సమాజములో గాని ఒక వంద సంవత్సరములకు పూర్వమువరకు ధర్మములను నిర్వచించాల్సిన అవసరము వచ్చినప్పుడు ధర్మశాస్త్రములు తెలిసిన పండితుల సహకారము తీసుకుని తీర్పులు చెప్పేవారు. దేశ కాలమాన పరిస్థుతులను బట్టి ధర్మము మారుతుంది. కాలానుగుణముగా ధర్మము యొక్క నిర్వచనమును మార్చే గుణము భారతీయ సమాజముయొక్క విశిష్టత. అలాగే క్రొత్త జనులు వచ్చి చేరినపుడు వారి వారి సాంప్రదాయములను కట్టుబాట్లను వారు కొనసాగించుకునే విధముగా వారికి తగిన వసతి చూపించడము భారతీయ సాంప్రదాయము. భారతీయ సమాజమునకు గల ఈ మానవత్వపు ధోరణి ఇక్కడకు వలస వచ్చిన ఎవ్వరినైన మంత్రముగ్దుల్ని చేస్తుంది. కొన్నాళ్ళకి వారు సనాతన ధర్మమునకు ఆయువుపట్టుగా మారతారు. దీనికి ఉదాహరణములు చాలా ఉంటాయి.

విఘ్నేశ్వరుడు యక్షజనులకు సంబందించినవాడు. అతను తొలుత దేవీ ఆలయము బయట కాపలాదారుగా పనిచేసి తరువాత సనాతనధర్మములో ప్రధాన దైవము అయ్యాడు. రావణుడు యక్షగంధర్వ జనులనుండి వచ్చి తొలుత రుద్రుడుగా పనిచేసి తరువాత రాజ్యాధికారము చేజిక్కించుకొని రాజాధిరాజు అయ్యాడు. తనదైన శైలిలో బ్రహ్మలను పోషించాడు. అశోకుడు తాను బౌద్ధమతాభిమాని అయినను భౌద్ధ వ్యతిరేక శాఖవారయిన అజీవకులకు దానములు ఇచ్చాడు. ఆధునిక యుగములో కూడా ఈ సాంప్రదాయము కొనసాగుతూనే ఉంది. ఔరంగజేబు కాశీ లోని ఒక ఆలయములో కృష్ణుని విగ్రహము తయారుచెయ్యడానికి బంగారము దానము ఇచ్చాడు. టిప్పుసుల్తాను శ్రింగేరి మఠములో సరస్వతీ దేవి విగ్రహము తయారుచెయ్యడానికి బంగారము దానము ఇచ్చాడు. 1985 వరకు ఇంగ్లేషువారుకూడా హిందూ మతమును ఉద్ధరించడానికే భారతదేశములో ఉంటున్నాము అని చెప్పుకునేవారు.

బ్రహ్మచర్యము మరియు గృహస్తాశ్రమ ధర్మములు:

మునుపటి అధ్యాయములలో బ్రహ్మచర్యము యొక్క విశిష్టతగురించి తెలుసుకున్నాము. విద్యార్ధులు బ్రహ్మచర్యము పాటించడము సనాతన ధర్మము. అధ్యాపకులు బ్రహ్మచర్యముపాటించడము విశిష్టగుణము. రాజన్ లు బ్రహ్మచర్యము పాటించడము ప్రాశస్త్యము. సామాన్యులు బ్రహ్మచర్యము పాటించడము విశిష్టము. బ్రహ్మచర్యము పాటించడము అందరికి ఆదర్శమయిన గుణవిశేషము. జనులు గృహస్తాశ్రమ నియమము పాటించి వంశాభివృద్ధి చెయ్యడము, బ్రహ్మణులను, ఆచార్యులను, బ్రహ్మచారులను, రాజన్ లను పోషించడము సామాన్య ధర్మము. ఒక గృహస్తుని యొక్క భార్యల సంఖ్యవిషయములో ఆంక్షలు ఎక్కడా సూచించలేదు. కాని కామమును నిగ్రహించుకోవడము అనే అంశము సామాజిక విలువలలో ఆదర్శప్రాయమయి ఉన్నది. అందుచేత ఏక పత్నీ ఆచారము గృహస్తులకు పరోక్ష నియమము.

బ్రహ్మచర్యము, గృహస్తాశ్రమము రెండు ఒకదానికొకటి వైరుధ్యమయిన నియమములయినను సమాజమునకు రెండింటివలన ఉపయోగమున్నందువలన రెండు ఆశ్రమములు ఒకదానినొకటి హానిచెయ్యకుండా జోడెడ్ల బండిలా సమాజము ముందుకు సాగడము సనాతన ధర్మము.

దేవీ ఆరాధన:దేవీ ఆరాధన సనాతన ధర్మము. రుద్రులు బ్రహ్మను కాపాడడము సనాతన ధర్మము. బ్రహ్మ దేవీ ఆరాధనను విస్తృతపరచడము సనాతన ధర్మము. దేవి పేర్లు మారతాయిగాని దేవిల ఆరాధన నిరంతరము కొనసాగుతుంది. దేవి అంటే ఆమె ఎవ్వరికి భార్యకాదు. ఈ రోజుకి దేవి ఆలయములలో ఎక్కడాకూడా ఆమెకు తోడుగా మగదేవతల విగ్రహములు గాని బొమ్మలుగాని నిలపరు. దేవి సర్వవ్యాపి. సర్వ శక్తికి మూలము. అందుచేత ఆమెకు మగదేవతల సహకారము అక్ఖరలేదు. ఆమె నిరంతర కన్య. ఆమెకు పిల్లలు ఉండరు. కాని ఆమె అందరికి తల్లి,విశ్వమాత. ఇదే సనాతన ధర్మము.

శివుడు:శివుడుకూడా అంతే. ఆయన అఖండ బ్రహ్మచారి. అందుకే ఆయన పరమశివుడు. శివుడుగాని, దేవి గాని నీతిబాహ్యమయిన పనులు, పాపములు, దుష్కృత్యములు సహించరు. సంతానము కాంక్షించే వారు ఈ అఖండ బ్రహ్మచారులయిన దేవీలను, శివుడిని ఆరాధిస్తారు. ఇదే సనాతన ధర్మము.

Vishnu (left) gives away his sister and bride Meenakshi's hand into the waiting hand of groom Shiva
Vishnu (left) gives away his sister and bride Meenakshi’s hand into the waiting hand of groom Shiva
(Picture courtesy: Richard Mortel from Riyadh, Saudi Arabia)

రుద్రుడొక్కడే శివుడు కాదు. దేవీ కూడా శివనే. దేవీని శివే సర్వార్థ సాధికే అన్నారు. శివుడైనా దేవీ అయిన ఇద్దరు బ్రహ్మచారులే. అందుచేతనే శివలింగము పానవట్టముపై ఊర్ధ్వముఖ స్థితిలో ప్రతిష్టించబడి‌ఉంటుంది. బ్రహ్మచర్యము దైవత్వమునకు ప్రధమ సోపానము. బ్రహ్మచర్యము పాటించనివారు దైవములుగా హిందువులపూజలు అందుకోలేరు.

అహల్య:

శివ పార్వతులను, రావణ మండోదరిలను, రామ సీతలను, వాలి తారలు ఇలా వీరిని భార్యభర్తలుగా చిత్రించడము సనాతన ధర్మముకాదు. శివుడు పార్వతి యొక్క, రావణుడు మండోదరియొక్క, రాముడు సీతయొక్క వాలి తారయొక్క ఆరాధకులు మాత్రమే, భర్తలుకాదు. రావణుడు సీత ప్రతిమను తస్కరించినాగాని సీత ప్రతిమను అపవిత్రముచెయ్యలేదు. సాంప్రదాయము ప్రకారము సీత ప్రతిమను పలాశ (మోదుగ) వృక్షముపై సురక్షితముగా నిలిపి ఉంచెను. వాలి సుగ్రీవులు తార యొక్క ప్రతిమకోసమే వైరము బూని ఒకరితో మరొకరు యుద్ధముచేశారు.

ప్రతిమలకు దాంపత్య ద్రోహము అంటకట్టడము సబబుకాదు. అహల్య గౌతముని భార్యగా పురాణములు చిత్రిస్తాయి. అహల్య ఇంద్రుని మోహించినట్లు అలా గౌతమునకు దాంపత్య ద్రోహము చేసినట్లు కొన్ని పురాణములు వర్ణిస్తాయి. ఇలాంటి కథనములలో ని అంతరార్ధము గ్రహించవలసిన అవసరము ఉంది. అహల్య ఒక ప్రతిమ అయినపుడు ఆమె ఇంద్రుని ప్రేమించడము అనేది అర్ధములేనిది. కాని గౌతముడు అహల్యను శపించడము వాస్తవము. అహల్య మామూలు ప్రతిమకాదు. దేవీ ప్రతిమ. అంటె జీవములేని ప్రతిమ కాదు. ఆమె జీవములేని సామాన్య ప్రతిమ అనే ఆలోచన గౌతమునకు గాని ఇంద్రునకు గాని ఉండదు. ఆమె దేవి. ఆమె ఇష్టములేకుండా ఇంద్రుడు అహల్య ప్రతిమను తస్కరించే సమస్య ఉండదు! అందుచే గౌతముడు అహల్యపై కినుకబూని అహల్యను ఆమె తన దివ్య శక్తులను కోల్పోయి సామాన్య ప్రతిమ/శిల గా మారిపోయేటట్లు శపించాడు.

 పంచ కన్యలు:

ఈ క్రింది శ్లోకమును పరిశీలిద్దాము,

అహల్య ద్రౌపదిసితతర మన్దొదరి తథ
పచకన్య? స్మరెన్నిత్య? మహపతకనసిని?”ఎవరైతే అహల్య, ద్రౌపది, సీతా, తార, మండోదరి మొదలయిన ంచ కన్యలను ఆరాధిస్తారో వారు సర్వ పాపములనుంచి విముక్తి పొందుతారు.”ఈ సీత, ద్రౌపది మొదలయిన నిత్య కన్యలయిన పవిత్ర విశ్వమాతలను మరొకరి భార్యలుగా చిత్రించడము శోచనీయము. పురాణములలో హ్రస్వదృష్టిగల కవులు ఈ పని చేసి‌ఉంటారు.

హ్రస్వదృష్టి:

శుక్రాచార్యుడు, భృగు మహర్షి మరియు కుబేరుని ఉదంతములు ఈ సందర్భములో మననము చేసుకుందాము. శుక్రాచార్యుడు బృహస్పతితో కలిసి అంగీరసునివద్ద వేద విద్యను అభ్యసించాడు. శుక్రాచార్యుడు, జమదగ్ని భృగు వంశమునకు సంబందించినవారు. కుబేరుడు వైశ్రవణ వంశమువాడు, కుబేరుడు రావాణుని దాయాది. బ్రహ్మ శుక్రాచార్యుని ఒక కన్నును పొడవడమువలన ఒంటికన్ను వాడు అయ్యాడు. అలాగే సరస్వతీదేవి కుబేరుని ఒక కన్నును పాడుచేసి డబ్బుతో పోయిన కన్ను కొన్నుకోమని చెబుతుంది. కుబేరుని ఒకకన్ను పింగళవర్ణముతో కూడి ఉంటుంది. అతని ప్రతిమలు అన్ని ముఖము ఒకప్రక్కకు ఒంగి ఉన్నట్లు చూపుతారు. భృగు మహర్షి విష్ణుమూర్తిని అవమానించినపుడు శ్రీమహావిష్ణువు భృగువునకు సుశ్రూషచేసే నెపముతో అరికాలిలో గల అతని కన్నును పొడిచివేస్తాడు.

ఈ మూడు ఉదంతములలోని అంతరార్ధము గ్రహించాల్సిన అవసరము ఉంది. ….

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)

(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswatiసరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavartaబ్రహ్మావర్తముAryanismఆర్యజాతి వాదము. )