శ్రీనాథుని కవితలు, చాటు పద్యములు
శ్రీనాథుని కవితలు, చాటు పద్యములు:
సిరిగలవానికి చెల్లును
తరుణుల పదియారు వేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా! గంగవిడుము పార్వతి చాలున్ !
ఫుల్ల సరోజ నేత్ర అల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేమొ? తింత్రిణీ పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో మెల్లగ నొక్క ముద్ద దిగ మ్రింగుమ నీ పస కాననయ్యెడిన్ !!
కాశికా విశ్వేశు కలసె వీరా రెడ్డి రత్నాంబరంబులే రాయుడిచ్చు
రంభగూడె తెలుగు రాయరాహత్తుండు కస్తూరికే రాజు ప్రస్తుతింతు
స్వర్గస్తుడయ్యె విస్సనమంత్రి మఱి హేమ పాత్రాన్న మెవ్వరి పంక్తి గలదు
కైలాసగిరి పండె మైలార విభుడేగి దినవెచ్చ మే రాజు తీర్చగలడు
భాస్కరుడు మున్నె దేవుని పాలికరిగె
కలియుగంబున నికనుంట కష్టమనుచు
దివిజ కవివరు గుండియల్దిగ్గురనగ
అరుగు చున్నాడు శ్రీనాథు డమరపురికి
దీనార టంకాల తీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల
పల్కుతోడై తాంధ్రభాషా మహాకావ్య నైషథగ్రంథ సందర్భమునను
పగలగొట్టించితుద్భట వివాదప్రౌఢి గౌడ డిండిమభట్టు కంచుఢక్క
చంద్రభూష క్రియాశక్తి రాయల యొద్ద పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు
నెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావు సింగన భూపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సరస సద్గుణ నికురంబ శారదాంబ !
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )