ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)

Rate this page

నేను రచించిన ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము) అను పుస్తకమును చదవండి. పుస్తకము కొనడానికి ఈ పిక్చర్ పై క్లిక్ చేయండి.

‘ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)’ అను నా పుస్తకము మొత్తము 265 పేజీల నిడివితో క్రౌన్ సైజ్ లో ముద్రితమయినది. ఈ పుస్తకములో 49 అధ్యాయములు కలవు. హిందూ గ్రంథములలో చెప్పిన చారిత్రక అంశములకు పురావస్తు ఆధారములను అనుసంధానము చేసి ప్రాచీన సప్త సింధు నదుల పరీవాహక ప్రాంతమే మన వేద భూమి అని ఈ పుస్తకములో చెప్పడమయినది. అనగా హరప్పా నాగరికత వాసులు వేద జనులు ఒకరేనని ఈ గ్రంధ రచయితే చెబుతున్నారు. అప్పుడు ఆర్యులు ద్రావిడులు వేరు వేరు జాతుల వారు అనే సిద్ధాంతము ఒక పెద్ద అపోహ అని తేలిపోతుంది. ఈ పుస్తకములో వేదములు, రామాయణము, మనుస్మృతి మొదలగు హిందూ గ్రంధములనుండి సంగ్రహించిన 250 పైన సంస్కృత శ్లోకములను తాత్పర్య సహితముగా ఇవ్వడమైనది. అన్నీ అంశములు సులభంతరంగా అర్ధం కావడానికి రచయిత స్వంతముగా తయారుచేసిన 58 చిత్రములు, 22 మ్యాప్ లు రచయిత వాడియున్నారు. ఈ పుస్తకములో వాల్మీకి రామాయణములో ఉటంకించిన భౌగోళిక వివరములకు పురావస్తు ఆధారములను సరిపోల్చి చూపి ప్రస్తుత హరప్పా పట్టణమే అసలు అయోధ్య అని, అలాగే ప్రస్తుత మొహంజోదారో పట్టణమే రావణాసురుడు ఏలిన లంకా నగరమని అదే మేలుహా అని చెప్పడమయినది. మరియు పౌరాణిక చతుర్యుగములు ప్రాచీన కాలంలో సప్త సింధు నదుల ప్రాంతములోనే జరిగినవని లెక్కలు కట్టి చెప్పడమయినది.

ఇంకనూ అఘోరులు ఎవరు, బ్రహ్మ తయారుచేసిన బాణములను  రుద్రులు వాడడమేమిటి? శివుణ్ణి లింగ రూపములోనే ఎందుకు పూజించాలి, సంస్కృతము ప్రాకృతము ఒకే భాషనా?…. ఇలా హిందూ ధర్మము లోని ఎన్నో ప్రశ్నలకు సమాధానములు కూడా ఈ పుస్తకములో లభిస్తాయి. నా ఈ పుస్తకము చదివి మీ అభిప్రాయములను తెలియజేయండి. – రచయిత, పరిశోధకుడు, పబ్లిషర్జ D V S నార్ధన్ ప్రసాద్ . (ప్రధమ ముద్రణ జనవరి, 2017, పునర్ముద్రణ జనవరి, 2024)

Read my Book and make a Review of the Book and give me FIVE Stars. – Janardhan Prasad DVS.