దైవజ్ఞ దైవజ్ఞుడు

Rate this page

దైవజ్ఞ/దైవజ్ఞుడు

దైవజ్ఞ దైవజ్ఞుడు: వాస్తవానికి సాధారణంగా జ్యోతిష్కులను వాస్తు శాస్త్రజ్నులను దైవజ్ఞ లేక దైవజ్ణుడు అని పిలుస్తాము. జ్యోతిష్కులను మనము వాస్తు సమస్యల నివృత్తి కొరకు శుభ ముహూర్తములు నిర్ణయించడానికి సంప్రదిస్తూ ఉంటాము. సాధారణంగా దైవజ్నులు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. అలాగే నిర్వార్ధంగా మనకు మంచి చేసే పనిలో ఉంటారు. అంచేత వారిని మనము గౌరవిస్తాము. వారు పాటించే నియమాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఇక్కడ తెలియ జేస్తున్నాను.

దైవజ్ఞ దైవజ్ఞుడు
Vyasa maharshi dictating Mahabharata to Ganesha

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)

దైవజ్ఞుని లక్షణములు

గణితేషు ప్రవీణోయః శబ్ద శాస్త్రే కృత శ్రమః

న్యాయవిద్ బుద్ధిమాన్ దేశ దిక్కాలజ్ఞో జితేంద్రయః

దైవజ్ఞులు గణిత శాస్త్రములో ప్రావీణ్యులు అయి, శబ్ద శాస్త్రములో శ్రమించి అధిపత్యం సాధించినవాడు, న్యాయ విదుడు, బుధ్ధిమంతుడు, దిక్కు, దేశము, కాల జ్ఞానము కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అయి ఉండవలెను.

త్రిస్కంధజ్ఞో దర్శనీయః శ్రౌత స్మార్త క్రియాపరః

సిద్ధాంత హోర సంహిత అనే ఈ మూడు స్కందముల పరిజ్ఞానం కలిగి ఉన్నవాడు, శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు తెలిసినవాడు, డంబం లేనివాడు, ఎల్లప్పుడు సత్యాన్ని పలికే వాడు దైవజ్ఞుడు అవుతాడు.

సంపత్యా యోజితాదేశ స్తద్విచ్ఛిన్నకథా ప్రియః

మత్తః శాస్త్రైక దేశేన త్యాజ్యస్తా దృజ్మహ్మీ క్షితాః

సంపదను ఆర్జించాలని లోభంతోను, ఇతరుల కలహ గాధలను వినే ప్రతితోను ఉన్న జ్యోతిష్కుని, మరియు శాస్తంలో కొంత భాగం నేర్చుకొని దాని తోనే గర్వించిన జ్యోతిష్కుని వదిలి పెట్టావలెను.

(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswatiసరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavartaబ్రహ్మావర్తముAryanismఆర్యజాతి వాదము. )

దైవజ్ఞుని కర్తవ్యములు

ఉథ్థాయోషసి దేవతాం హృది నిజాం ధ్యాత్వా వపుశ్శోధన్ం

కృత్వాస్నాన పురస్సరం సలిల నిక్షేపాది కర్మాఖిలం

కృత్వా మంత్ర జపాదికం చ విధివత్ పంచాంగ వీక్షాం తథా

ఖేటానం గణనంచ దైవవిదథ స్వస్థాంతరాత్మా భవేత్

బ్రహ్మీ ముహూర్తములోనే నిద్రలేచి ఇష్ట దైవాన్ని ధ్యానించి శరీర శౌచ క్రియలు నిర్వహించి దంత ధావన స్నాన ఆచమన ఆర్ఘ్య దానాదులు మంత్ర జపాది కర్మలు మొదలగు నిత్య కృత్యాలను నిర్వహించి పంచగము చూసి గ్రహగణనము ప్రశాంతమయిన మనస్సుతో దైవజ్ఞులు చేయవలెను. కుడిభుజము ఎల్లప్పుడు ఖాళీగా అనగా వస్త్రముతో కప్పకుండా విడచివేయాలి. ఎందుకు ? ఇది ఒక మూఢనమ్మకమా? లేక ఏదయిన శాస్త్రీయత దీనిలో నిగూఢముగా దాగి ఉన్నదా? అనే అంశము చూద్దాము…….