చతురాశ్రమ ధర్మములు

Rate this page

చతురాశ్రమ ధర్మములు:

మానవులు తమ జీవిత క్రమములో నిర్వహించవలసిన నాలుగు విధులను చతురాశ్రమ ధర్మములు అని  మన ధర్మ శాస్త్రములు చెబుతున్నాయి. అవి వరుసగా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. సాధారణంగా జన్మించినది మొదలు చివరి వరకు సకల మానవులు వివిధ దశల వారీగా జీవితమును కొనసాగిస్తారు. అవి కూడా నాలుగు దశలే. బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము అనేవి ఆ నాలుగు దశలు. ఈ నాలుగు దశలు మానవుని శరీర పరిణామ క్రమమును తెలియజేస్తాయి. అదే చతురాశ్రమ ధర్మములు ప్రతి మానవుడు జీవితములో ఆచరించాల్సిన విధులను గూర్చి చెబుతాయి.

ఈ శారీరక పరిణామ క్రమ దశల మరియు ఆశ్రమ ధర్మములు రెండు కూడా నాలుగే అయిననూ వాటి కాలముల వ్యవధిలో వ్యత్యాసము ఉంటుంది. ఒక్కోసారి ఒకదానికొకటి అతిచారము అవుతాయి. ఉదాహరణకు కౌమార యవ్వన దశల సమయంలో ఒక వ్యక్తి బ్రహ్మచారిగా విద్యాభ్యాసము చెయ్యాలి. మళ్ళీ యవ్వన కాలములోనే గృహస్తునిగా అవతారము ఎత్తి కుటుంబ, సామాజిక బాధ్యతలు నిర్వహించాలి. వృద్ధాప్యము సమీపించిన తరువాత వానప్రస్తము ఆశ్రమము స్వీకరించాలి. చివరిగా సంన్యాసము స్వీకరించి మోక్ష సాధన చెయ్యాలి. అనగా వృధ్ద్ధాప్యము లో వానప్రస్థము, సంన్యాసము అను రెండు ఆశ్రమములలో జీవితము గడపాలి. 

ఇలా చతురాశ్రమ ధర్మములను ఆచరించడము ద్వారా మానవులు తమకు జన్మ ద్వారా సంక్రమించిన త్రిఋణములను నివృత్తి చేసుకోనవచ్చు.

త్రిఋణములు, బ్రహ్మ చర్య వ్రతము, గృహస్థాశ్రమ ధర్మముల వివరములు  వేరు వేరు పేజీలలో చెప్పడమయినది. సదరు పేజీలు సందర్శించి చదవ గలరు.  

పంచ దశ కర్మలు లేక షోడశ కర్మలు:

మానవుని జన్మించిన దగ్గర నుండి మొదలు పెట్టి జీవిత చరమాంకం వరకు మనిషికి శాస్త్ర రీత్య జరుగవలసిన ఉపచారములు లేక సంస్కారములను పంచ దశ కర్మలు లేక షోడశ కర్మలు అని ధర్మ శాస్త్రములు చెప్పుచున్నవి.  

అవి వరుసగ: 1. గర్భదానము, 2. పుంసవనము, 3. సీమంతము, 4. జాతకర్మ, 5. నామకరణమ్, 6. అన్నప్రాసనం, 7. చౌలం, 8. అక్షరారంభం, 9. ఉపనయనం,  10. ప్రజాపత్యం, 11. సౌమ్యమ్, 12. ఆగ్నెయమ్, 13. వైస్వదేయం,  14. స్నాతకం,   15. వివాహం, ఆఖరుగ 16. అంత్యేష్టి.

పైన వివరించిన కర్మలలో చివరి సంస్కారము అంత్యేష్టిని మినహాయిస్తే పంచదశ కర్మలు అని పదహారవ కర్మ అంత్యేష్టితో కలిపి షొడశ కర్మలు అని చెబుతారు.  

( ఒక చిత్రమయిన విశయమేమిటంటె ౧౫౦ సంవత్సరాల పూర్వం బ్రిటిశు వారు ఈ కర్మలను ఎలా ఎగతాళి చేశారొ  ప్రస్తుతం చదువుకున్న వారు కూడ అదే బాణీలొ ఈ సంస్కారాలలోని లోపాలను మాత్రమి ఎత్తి చూపిస్తు వీటి లోని మహాశయాలను విస్మరిస్తున్నారు . అయితే ఎవరి పంధాలొ వారు ఈ కర్మలను తరతరాలుగ పాటిస్తుఉనె వ్య్న్నరు).

(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswatiసరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavartaబ్రహ్మావర్తముAryanismఆర్యజాతి వాదము. )

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)