గృహస్థాశ్రమ ధర్మము

Rate this page

గృహస్థాశ్రమ ధర్మము చతురాశ్రమ ధర్మము లలో ఒకటి అయి ఉన్నది. మిగతావి బ్రహ్మచర్యము, వానప్రస్థము, సంన్యాసము. మనకు జన్మించిన తక్షణం సంక్రమించే త్రిరుణములను నివృత్తి చేసికోనడానికి మానవులు చతురాశ్రమ ధర్మములు పాటించి తమ తమ కర్తవ్యములను నిర్వర్తించ వలెను.

మానవ జీవితములో గృహస్థాశ్రమము ఒక ప్రధాన ఘట్టము. ఒక గృహస్తుడు సమాజములో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. గృహస్తునిపై అతని భార్య, పిల్లలు, మాతా పితరులే కాకుండా బ్రహ్మచారులు, ఋషులు, వానప్రస్తులు మొదలయిన వారు కూడా అధారపడి జీవిస్తుంటారు. పరాశర మహా ముని గృహస్తుల యొక్క ఘనత ఎలా చెబుతున్నారో చూడండి,

….( ఈ పేజీ నేను పరిశోధించి రచించిన “పాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేదకాల సమాజము) ” అను పుస్తకములోనిది. అధ్యాయము  21,  ‘గృహస్థాశ్రమ ధర్మము’)

వానప్రస్థో బ్రహ్మచారీ యతిశ్చైవ తధ ద్విజాః
గృహస్థస్య ప్రసాదేన జీవన్యేతే యథావిధిః
గృహస్థ ఏవ యజతి గృహస్థ్స్తప్యతే తపః
దదాతిచ గృహస్థశ్చ తస్మాచ్ఛ్రేయో గృహాశ్రమే – పరాశర ముని

ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)
ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)పేజీలు 265. క్రౌన్ సైజు పుస్తకము.

హిందూ సనాతన ధర్మము వివరములు. మూలముల గురించి తెలుసుకొనడానికి నా ఈ పుస్తకము చదవండి. ఈ పుస్తకములో 240 పైన వేద శ్లోకములను తెలుగు అనువాదముతో సహా ఉటంకించడ మయినది. ఈ పుస్తకములో పురావస్తు, చారిత్రక చిత్రములు: 58, మ్యాప్ లు: 22 కలవు. వెల రు. 499/- (పోస్టేజి ఉచితం)

Buy now

అర్థం: “వానప్రస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, ద్విజులు మున్నగువారు గృహస్థునినిపై ఆధారపడియే తమతమ ఆశ్రమ ధర్మములను నెరవేర్చుకొనుచూ జీవిస్తున్నారు. ఇందుచేత గృహస్తాశ్రమము సర్వ శ్రేష్ఠ మయినది.” మను స్మృతిలో ఏమంటున్నారో చూడండి,

యథా వాయుం సమా శ్రిత్య వర్తంతే సర్వజంతవ:
తథా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వ ఆశ్రమా: – మను స్మృతి

అర్థం: "ప్రాణవాయువు నాశ్రయించి జంతువులెల్ల జీవించునట్లు, గృహస్థుని నాశ్రయించి తక్కిన యాశ్రమములవారు జీవింతురు." 

యధా నదీనదాస్సర్వే సాగరే యాంతి సంస్ధితిమ్
తధైవాశ్రమిణస్సర్వే గృహస్ధే యాంతి సంస్ధితిమ్.
(మను స్మృతి)

అర్థం: “అన్ని నదులను నదములను సముద్రమును జేరునట్లు తక్కిన యాశ్రమములవారందరు గృహస్ధునిపై నాధారపడియున్నరుగాన, వానిని జేరుచున్నారు.”

సర్వేషామపి చైతేషాం వేదస్మృతివిధానతః
గృహస్ధ ఉచ్యతే శ్రేష్ఠః స త్రీనేతాక్ బిభ ర్తి హి
(మను స్మృతి)

“శ్రుతి, స్మృతులందు జెప్పినట్లు ఈ నాలుగాశ్రమములవారిలో కెల్లను గృహస్ధుడే ఉత్తముడనబడును. అతడే కదా తక్కిన మూడాశ్రమములవారిని బోషించుచున్నాడు. కావున ఇతడే శ్రేష్ఠుడు.”అలా గృహస్తాశ్రమము అన్ని ఆశ్రమములకు తలమానికమయినది అయు ఉన్నది. అందుచేత బ్రహ్మచారి తన చదువు పూర్తిచేసుకొనిన తరువాత ఆచార్యుని అనుమతి బడసి గృహస్తాశ్రమములో ప్రవేశించవలెను. వేదాభ్యాసము గావించిన తరువాత బ్రహ్మచారి ధర్మమును పోషించడానికి, సంతానమును బడయడానికి, స్త్రీని చేపట్టి గృహస్తాశ్రమములో ప్రవేశించవలెను.

“ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే”

ఎందుచేతనంటే ఒక మనిషి సంతానమును బడసి వంశోద్ధరన కార్యము సాఫల్యము చేసిననాడే అతని జీవితము పరిపూర్ణమవుతుంది.

“ప్రజయాహిమనుష్యః పూర్ణః”

(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswatiసరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavartaబ్రహ్మావర్తముAryanismఆర్యజాతి వాదము. )

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)