ఏడుకొండలు
ఏడుకొండల వేంకటేశ్వర స్వామి: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఏడుకొండల నివాసాన్ని రెండు కొండలుగా కుదించడము మరియు తిరుమల లో క్త్రైస్తవ చర్చ్ కట్టడానికి ప్రయత్నాలు జరగడాన్ని నిరసిస్తు అప్పట్లో వ్రాసిన వ్యాసమిది. హిందువుల హక్కుల పరి రక్షణకు ఇండియాలో సరి అయిన చట్టాలు లేవు. ప్రభుత్వం హిందువులదె కదా అనే అపోహ వల్ల ప్రస్థుత దుస్థితికి కారణము. ఉన్న చట్టాలు ఏం చెబుతున్నాయో చట్టాల్లోని అంశాలు ఎలా ఆచరించబడుతున్నాయొ పరిశీలిద్దాం.
తిరుపతి లో ఉద్యోగస్తులందరు హిందువులయితే క్త్రైస్తవులు ఎక్కడనుంచి పుట్టుకొచ్చారు? ఇలాంటి సమస్య ఎలా ఉత్పన్నమయింది?
దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్త్రం లో ప్రభుత్వం షెడూలు కులాల ద్రువీకరణ పత్రాల జారి విధానం లొ అనుసరిస్తున్న మెతక విధానమె. చట్ట రీత్య హిందు మతాన్ని అనుసరిస్తున్న ఆది ఆంధ్రులు మాత్రమె ఎస్ సి సర్టిఫికట్ లకు అర్హులు. ఆది ఆంధ్ర క్త్రైస్తవులు ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రంలొ వెనుకబడిన తరగతుల ( బి సి ) జాబితాలో ఉంటారు.
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
అయితె వాస్తవానికి ఆది ఆంధ్రుల్లో చాలమంది క్త్రైస్తవ మతం లో పుట్టి, పెరుగిన వారు , క్త్రైస్తవ మతం లోకిమారిన వారు ఎస్ సి కుల ద్రువేకరణ పత్రాలతో ప్రభుత్వంలొ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో చేరుతుంటారు. ఇలా తప్పుడు సర్టిఫికట్ లు జారీ చెయ్యడం, వాటిని ఉపయోగించుకోవడం చట్ట రీత్య నేరం.
ఇలా దొంగ ఎస్ సి ద్రువీకరణ పత్రాలతో శ్రీ వేంకటేశ్వర స్వామి (Tirumala Sri Venkateswara temple) వారి దేవస్తానంలొ ఉద్యోగాలు సంపాదించిన వారి ఆగడమే ఈ తిరుమలలో చర్చి కట్టే ప్రతిపాదన వ్యవహారం. ఈ క్త్రైస్తవ ఉద్యోగస్తులకు చట్ట రీత్య అసలు హిందు దేవస్తానాల్లొ స్థానం లేదు. దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం హిందువులు కానివారు హిందు దేవాలయాల్లొ ఉద్యోగాలకు అనర్హులు. ఈ క్త్రైస్తవుల్ని తిరుమల నుండి ఏరివేయడం పని ఎవరు నిర్వహించగలరు? ప్రభుత్వం అనగా ముఖ్య మంత్రి క్త్రైస్తవుడు అయి ఉన్నపుడు ఈ పని ఎవరు చేస్తారు?
ALSO READ MY ARTICLES ON
- Indian Constitution (Important Articles)
- Citizen’s Fundamental Rights
- Basic Structure Doctrine of the Constitution
- Article 20
- Right to Life and Liberty
- Magna Carta
- England Bill of Rights
- American Bill of Rights
- French Bill of Rights
నా ఈ వ్యాసాలను కూడా చదవండి