భారతీయ హిందు సంస్కృతి

Rate this page

భారతీయ హిందు సంస్కృతి: హిందూ మతం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన సాంస్కృతిక వారసత్వము కలిగిన మతము అయి ఉన్నది. కారణం హిందూ మతము శాస్త్రీయత కలిగిన మతము. మత పరంగా చూస్తే, హిందూ మతంలో మానవులు దేవతలను వివిధ మార్గములలో ఆరాధించి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ దేవతలు ఒక్కొక్కరు ఒక్కో రకమైన విశ్వజనిత దివ్య శక్తికి ప్రతిరూపంగా నిలిచి ఉంటారు. హిందువులు వారిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆ కాస్మిక్ ఫోర్స్ ల దుష్ప్రభావములను తగ్గించుకోవడానికి చూస్తారు. అంటే హిందూ మతం మానవులను దేవీ దేవతలను అనుసంధానము చేస్తుంది.

హిందూ మతంలో రెండు ప్రధాన తత్వములు కలవు. అవి ఒకటి ద్వైతము రెండవది అద్వైతము. ద్వైతములో దేవుడు మానవుడు వేరు వేరు అస్తిత్వములు కలిగి ఉంటారు. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు, ధ్యానములు వంటి మాధ్యములు ఉపయోగించాలి. రెండవ తత్వములో దేవుడు మానవుడు వేరు కాదు. వివిధ పద్ధతుల ద్వారా మానవునిలో అనగా మనలోనే దాగి ఉన్న దేవుని తెలుసుకోవడం.      

ఇక సామాజిక స్థాయిలో చుస్తే, హిందూ మతము వివిధ సాంప్రదాయములను ఆచారములను కలిగి ఉండే విభిన్న సామాజిక సమూహములు ఒకేచోట సామరస్య పూర్వకంగా సహజీవనం చెయ్యడానికి ఉపకరించే విధంగా ఉంటుంది. ఈ విధమైన సంస్కృతి “ఆచారా పరమో ధర్మః” అను సూత్రంపై ఆధారపడి నడుస్తుంది.

ఆచార పరమో ధర్మ:

‘ఆచారా పరమో ధర్మః’ అను భారతీయ సాంప్రదాయములో జనులు ఎవరి ఆచారములను, సాంప్రదాయములను ఎవరికి వారు పాటిస్తూ ప్రధాన సమాజ జీవన స్రవంతిలో అంతర్భాగంగా అందరూ కలిసి మెలసి జీవిస్తారు.. క్రొత్తగా వచ్చి చేరిన వారిని ఆదరించి వారికి సమాజములో వసది సదుపాయములు, సముచిత స్థానమును కల్పించి ఆహ్వానించే సాంప్రదాయము అనాదిగా భారత దేశములో కొనసాగుతూనే వస్తుంది. ఈ విధమైన పడికట్టు పాశ్చాత్య విధానములకు పూర్తిగా భిన్నము అని గ్రహించాలి. అక్కడి విధానమును అక్కల్చురేషన్ అంటారు. వారి విధానములో క్రొత్తవారు వారి మతమును పూర్తిగా త్యజించి వారు వెళ్ళిన క్రొత్త ప్రదేశములోని మత సాంప్రదాయములను స్వీకరించాలి. అంటే అప్పటివరకూ వారు పటిస్తున్న సంప్రదాయములు మాయపైపోవాలి.

ధర్మో రక్షతి రక్షితః

మనుస్మృతి గ్రంధము “ధర్మో రక్షతి రక్షితః” అని చెబుతుంది, దీని అర్థం “ధర్మాన్ని పాటించే వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది”. అంటే సనాతన ధర్మమును ఆచరించేవారిని ధర్మమే రక్షిస్తుంది అని అర్థము. ఇతర మతాలలోనయితే ఆ మత నియమాలను పాటించకపోతే తోటి మతస్తులు అతనిని శిక్షించాలి. అలాగే దేవుడు వారిని శిక్షించడము గాని తుద ముట్టించడము కానీ చేస్తాడు. అటువంటి హెచ్చరికలు హిందూ గ్రంధములలో లేవు. నేను వేదాలు, మనుస్మృతి, రామాయణం, మహాభారతం మరియు వివిధ పురాణాలను అధ్యయనం చేశాను, కానీ ధర్మాన్ని పాటించడంలో విఫలమైతే దేవతలచే లేదా పాలకుడిచే శిక్షించబడతారని చెప్పే ఏ ఆదేశాన్ని నేను ఎక్కడా చూడలేదు. ధర్మాన్ని పాటించని వారు హిందూ మతములో చాలా అరుదు. జనులు స్వచ్ఛందము గానే ధర్మాన్ని ఆచరిస్తారు. ఇదే హిందూ మతము యొక్క ప్రత్యేకత.

భారతవర్షం

హిందూ సనాతన ధర్మం ఎక్కడైతే ఉద్భవించి, వర్ధిల్లు చున్నదో అదే భారతవర్షం అని యాజ్ఞవల్క్య స్మృతి చెబుతుంది. ఏ దేశంలో నైతే కృష్ణజింక స్వేచ్ఛగా నిరాఘాటంగా సంచరిస్తుందో ఆ దేశమే భరతవర్షం అని మనుస్మృతి చెబుతుంది. కాలక్రమేణా భారతవర్షంను జంబు ద్వీపం, భరత ఖండం, బ్రహ్మావర్తం, సప్తద్వీపం, మణిద్వీపం, ఆర్యవర్తం, సత్యలోకం మరియు ఋషి దేశం వంటి అనేక పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే హిందూ మతం షుమారు 7000 సంవత్సరములనుండి మనుగడలో ఉంది. హిందూ మత గ్రంధాలను షుమారు 1500-2000 సంవత్సరాల పూర్వము నుండి పుస్తక రూపంలో నిక్షిప్తం చేస్తూ వస్తున్నారు. అంతకు ముందు వేదములు, వేదాంగములు, శాస్త్రాలు అన్నీ కూడా మౌఖికంగానే ఒక తరము నుంచి తదుపరి తరమునకు సజీవంగా బదాలీ అవుతూ వస్తున్నాయి. ఈ దివ్య కార్యక్రమమును ఋషులు, ఆచారులు, బ్రహ్మచారులు తరతరాలుగా నిర్వహిస్తు వస్తున్నారు. ఈ విధముగా ఛందో బద్దంగా కూర్చబడిన వేద శ్లోకములను కంఠస్థం చేసి గుర్తు పెట్టుకుని యజ్ణ యాగాదులు నిర్వర్తించే సమయంలో శ్రుతి చేస్తారు.  అంచేత వేదములను శృతులు అన్నారు. మిగతా వాటిని అనగా పురాణములు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు మొదలైన వాటిని స్మృతులు అంటారు.

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారత రాజ్యాంగము, పౌర హక్కులు, స్వాతంత్ర్య పోరాటము మరియు ఆంధ్రుల చరిత్ర మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)

ఇక్కడ ఒక చిత్రమైన వాస్తవమొకటి ఉంది. అదేమిటంటే వేదములు గాని శాస్త్రములు గాని చదువని వారు కూడా వాటిలో ఉండే నీతి నియమాలను తుచ తప్పకుండ పాటిస్తారు. అనగా తరతరాలుగా నీతి నియమాలు కొనసాగుతూ వస్తున్నవి అని అర్ధము. అందుచేతనే హిందూ ధర్మమును సనాతన ధర్మము అన్నారు.

పుస్తకములు లేకుండా వేదములను ధర్మ శాస్త్రములను వేల సంవత్సరముల నుండి సజీవంగా నిలిచి ఉండడానికి ఒక విచిత్రమైన కారణం ఒకటుంది. మొదటిది శ్రుతులను స్మృతులను పవిత్రంగా భావించడము. రెండవది, ఈ వేద సంపదను నేర్చిన బ్రాహ్మణులను వారు ఎంతటి నేరము చేసినా గాని సామాన్యులకు విధించే మరణ శిక్షను వారికి విధించక పోవడమే. (తప్పని పరిస్థితుల్లో ఆ నేరం చేసిన బ్రాహ్మణునికి శిరో మండనము చేయడము లేదా గ్రామము నుంచి బహిష్కరించడము వంటి శిక్షలు అమలు పరిచేవారు.) అలా ఆ బ్రాహ్మణుని జ్ణాన సంపద అతనితో అంతమవ్వకుండా సమాజము కాపాడుకున్నది.

సంస్కృతుల సంగమ స్థలం మరియు జాతుల మొజాయిక్

భౌగోళికంగా భారతదేశాన్ని ఒక ఉపఖండంగా పిలుస్తారు. ప్రాచీన సమాజంలో అయినా, మధ్యయుగంలో అయినా లేదా ఆధునిక కాలంలో అయినా, భారతదేశం సంస్కృతుల సంగమంగా మరియు జాతుల సమ్మేళనంగా యుగ యుగాలుగా జీవించి ఉంది మరియు ఇప్పటికీ కొనసాగింది. ఈ దేశం బహుళ జాతి మరియు బహుభాషా దేశం. ప్రపంచంలోని ఏ జాతి కూడా భారతదేశంలో ప్రాతినిధ్యం వహించకుండా లేదు, మరియు ఏ మతం కూడా భారత గడ్డపై కనిపించకుండా లేదు. భారతదేశంలో అడుగుపెట్టిన ప్రతి విదేశీ జాతి కాలక్రమేణా ఈ నేల బిడ్డలుగా మారి, భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకుని తమదైన శైలిలో ప్రతీ వారు భారతీయ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారు.

ఆచరణాత్మకంగా ప్రపంచంలోని ప్రతి జాతి మరియు మతానికి చెందిన ప్రజలు ఇప్పుడు భారతదేశాన్ని తమ నివాసంగా భావిస్తున్నారు. తన ప్రత్యేకమైన సామాజిక స్వరూపాన్ని చెదరగొట్టకుండానే, భారతదేశం అనేక రకాల వర్గాలను స్వీకరించింది. ఆ విధంగా, రెండు శతాబ్దాల ఆంగ్లేయ క్రైస్తవ పాలన మరియు సుమారు 700 సంవత్సరాల ఇస్లామిక్ పాలన కూడా భారతదేశపు హిందూ మత స్వరూపాన్ని ఎక్కువగా మార్చలేకపోయాయి. ప్రస్తుతం, భారతీయులలో 14 శాతం మంది మాత్రమే ముస్లింలు మరియు 2 శాతం కంటే తక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు.

హిందూ మత శాఖలు

సనాతనంగా భారతీయ సంస్కృతి భిన్నత్వములో ఏకత్వము అను నానుడిని ప్రతిబింబిస్తుంది. భారతీయులలో కొంతమంది వైష్ణవం, కొందరు శైవం, కొందరు బౌద్ధమతం మరియు కొందరు జైన మతాన్ని ఆచరిస్తారు. ఇరాను దేశ ప్రాచీన జొరాస్ట్రియనమతం భారత దేశంలో జీవించి ఉంది. గురునానక్ హిందూ మరియు ఇస్లామిక్ మత ఆచారాలను కలగలిపి తయారు చేసి స్థాపించిన సిక్ఖు మతం పంజాబులో ప్రధాన మతము అయి ఉంది. సమాంతరంగా, ప్రతి గ్రామంలో ఒక స్థానిక దేవి ఆరాధన జరుగుతుంది. గ్రామములోని జనులు వారి మత శాఖల ప్రభావంతో సంబంధము లేకుండా అందరూ గ్రామ దేవతను పూజిస్తారు.  

హెకెనోథీజం

మరొక చిత్రమైన భావన ఒకటుంది. హిందూ దేవి దేవతలలో ప్రతి ఒక్కరినీ ఆ దేవి దేవత నే సర్వే సర్వ గా నమ్ము పూజిస్తారు. ఉదాహరణకు దుర్గా దేవి శివునికి దేవి అని చెబుతారు. మళ్ళీ దేవి శివునికి భార్య అని చెబుతారు. ఇక పవిత్ర గ్రంథాల విషయానికొస్తే, శైవులకు శివ పురాణం పవిత్ర గ్రంథం, వైష్ణవులకు విష్ణు పురాణం పవిత్రమైనది, ఈ విధంగా ఉంటుంది.

లౌకిక గ్రంథాలు

హిందూ మతం లో లౌకిక గ్రంథాలు పుష్కలంగా ఉన్నాయి. ఉదాహరణకు, వారసత్వ చట్టం సందర్భంలో, మితాక్షరి మరియు మనుస్మృతి వంటి గ్రంథాలను అధ్యయనం చేస్తారు. నిత్యం మనం ఆచరించే మతపరమైన నియమ నిబంధనల కోసం కల్ప సూత్రాలను ఉపయోగిస్తారు. నృత్యకళను నేర్చుకోవడానికి మరియు అభ్యసించడానికి భరతుని నాట్యశాస్త్రాన్ని అభ్యసిస్తారు. సంస్కృతం నేర్చుకోవడానికి కోసం పాణిని యొక్క శిక్ష స్మృతి, యోగశాస్త్రం కోసం పతంజలి పఠిస్తారు.  

వాస్తవానికి అథర్వణ వేదం మూలవేదము. అథర్వణ వేదమును బ్రహ్మ వేదము అంటారు. దానిలో లౌకిక అలౌకిక అంశములు రెండు ఉంటాయి. ఋగ్వేదము అథర్వణ వేదము రెండింటిలోను 30 శాతము శ్లోకములు ఒకటే అంటే ఆశ్చర్యము కలుగుతుంది. ప్రాచీయన వైద్యులు చరకుడు, శుశ్రూతుడు తాము అథర్వణ వేదమునుండి అతి ముఖ్యమైన వైద్య అంశములు నేర్చుకున్నామని అన్నారు.

బాగన్ మరియు బోరోబుదూర్

అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం భారతదేశంలో కాకుండా, ఇండోనేషియాలోని బోరోబుదుర్‌లో మరియు మయన్మార్‌లోని బగాన్‌లో ఉన్నవి అనే విషయం గమనించదగ్గది. ఇంకా చైనా, జపాన్ మొదలైన దేశాల సమాజాలు మరియు ప్రజలు బౌద్ధమతాన్ని అనుసరిస్తారు. (గౌతమ బుద్ధుడు సాంఖ్య తత్వశాస్త్రానికి చెందినవాడు. మరియు అతను గౌతమ, కపిల మహర్షుల శిష్యుడు.)

అజీవికలు   

బౌద్ధమతాన్ని అనుసరించి ప్రచారము చేసిన అశోకుడు, ఆజీవికులకు నివాస స్థలాలను (గుహలను) మరియు వస్తువులను బహుకరించాడు. ఆజీవికులు బౌద్ధులకు ప్రత్యర్థి వర్గం అనే విషయాన్ని తెలుసు కుంటె ఆశ్చర్యకరంగా ఉంటుంది. 

(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswatiసరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavartaబ్రహ్మావర్తముAryanismఆర్యజాతి వాదము. )